ఇదే కదా లైఫ్‌.. మామా బ్రో

ABN , First Publish Date - 2023-01-21T05:42:31+05:30 IST

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. కరాటే రాజు నిర్మాత...

ఇదే కదా లైఫ్‌.. మామా బ్రో

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. కరాటే రాజు నిర్మాత. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఫిబ్రవరి 17న విడుదల అవుతోంది. శుక్రవారం ‘మామా బ్రో’ అనే గీతాన్ని విడుదల చేశారు. కథానాయకుడి తత్వాన్నీ, జీవితంపై అతనికున్న దృక్పథాన్నీ ఆవిష్కరించే గీతం ఇది. రామ్‌ మిరియాల ఆలపించిన ఈ గీత్నాన్ని కాశర్ల శ్యామ్‌ రాశారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. సంభాషణలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ.

Updated Date - 2023-01-21T05:42:33+05:30 IST