చిరు విలన్‌ రానా?

ABN , First Publish Date - 2023-10-27T01:34:49+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది....

చిరు విలన్‌ రానా?

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే చిత్రమిది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ప్రతినాయకుడి పాత్ర కోసం రానా పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఆరుగురు కథానాయికలకు చోటుంది. వారి పేర్లు త్వరలో చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆరు పాటలుంటాయి. చంద్రబోస్‌ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు.

Updated Date - 2023-10-27T01:34:49+05:30 IST