కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భాగమతి మళ్లొస్తోందా?

ABN, First Publish Date - 2023-11-08T01:03:25+05:30

ఈమధ్య అనుష్క కెరీర్‌ మరీ మందగమనంగా సాగుతోంది. తను సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే.. ఇప్పుడు స్వీటీ ఫోకస్‌ మళ్లీ సినిమాలపై మళ్లింది...

ఈమధ్య అనుష్క కెరీర్‌ మరీ మందగమనంగా సాగుతోంది. తను సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే.. ఇప్పుడు స్వీటీ ఫోకస్‌ మళ్లీ సినిమాలపై మళ్లింది. ఇటీవల విడుదలైన ‘మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి’ మంచి విజయాన్ని అందుకోవడంతో స్వీటీకి బూస్టప్‌ దక్కినట్టైంది. అందుకే వరుసగా సినిమాలు ఒప్పుకొంటోంది. చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో అనుష్క ఓ కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు ‘భాగమతి’ సీక్వెల్‌కి ‘ఓకే’ అన్నట్టు టాక్‌. అనుష్క నటించిన ‘భాగమతి’ మంచి విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. అశోక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఇప్పుడు సీక్వెల్‌కి సరిపడా కథ సిద్ధమైందని తెలుస్తోంది. అనుష్క నటించే 50వ సినిమా ఇదే అయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-11-08T01:03:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!