ఇంటిల్లిపాదీ మెచ్చే కథ

ABN , First Publish Date - 2023-03-11T00:28:23+05:30 IST

నరేశ్‌, రాహుల్‌ రామకృష్ణ, నవ్య స్వామి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్య దేవర నాగవంశీ, మారుతి టీమ్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి.

ఇంటిల్లిపాదీ మెచ్చే కథ

నరేశ్‌, రాహుల్‌ రామకృష్ణ, నవ్య స్వామి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్య దేవర నాగవంశీ, మారుతి టీమ్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఐవీవై ప్రొడక్షన్స్‌ తెరకెక్కించింది. సురేశ్‌ నరెడ్ల దర్శకుడు. త్వరలోనే విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ ‘‘మొదట్లో డిజిటల్‌ సినిమాగానే ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించాం. కానీ అవుట్‌పుట్‌ చూశాక థియేటర్లలో విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చామ’’న్నారు. మారుతి మాట్లాడుతూ ‘‘ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. నరేశ్‌ పాత్ర ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తెలంగాణ మాండలికంలో మాట్లాడారు. ఏ పాత్ర అయినా అద్భుతంగా పోషిస్తార’’న్నారు. ‘‘లాక్‌ డౌన్‌ తరవాత భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాల్ని ఆదరిస్తున్నారు. ఆ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుంది. కల్యాణీ మాలిక్‌ అందించిన బాణీలు, కాసర్ల శ్యామ్‌ సాహిత్యం ప్రధాన ఆకర్షణ’’ అని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-03-11T00:28:24+05:30 IST