వినూత్నంగా దక్ష
ABN , First Publish Date - 2023-08-17T03:59:23+05:30 IST
ఆయుష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అను, అఖిల్, రియా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు..

ఆయుష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అను, అఖిల్, రియా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 25న విడుదలవుతోంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు దశరథ్, ఉప్పల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సినిమా కథ, స్ర్కీన్‌ప్లే కొత్తగా ఉంటాయి అని ఆయుష్ చెప్పారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ‘దక్ష’ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు అన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయని నిర్మాత తెలిపారు.