కొత్తదనమే విజయ రహస్యం
ABN , First Publish Date - 2023-04-04T03:40:41+05:30 IST
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘కలర్ ఫొటో’, ‘మసూద’ లాంటి చిత్రాలతో కళా దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు క్రాంతి కుమార్ రెడ్డి. ఇప్పుడు రెండు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లూ చేస్తూ...
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘కలర్ ఫొటో’, ‘మసూద’ లాంటి చిత్రాలతో కళా దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు క్రాంతి కుమార్ రెడ్డి. ఇప్పుడు రెండు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లూ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ ‘‘మాది అనంతపురం జిల్లాలోని, శెట్టూరు గ్రామం. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పీజీ చేశా. తెలుగు యూనివర్సిటీ నుంచి మూడు డిప్లోమాలు పొందాను. చిన్నప్పటి నుంచీ కళలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం. ఆ ప్రభావంతోనే చిత్రసీమలోకి అడుగుపెట్టాను. నా తొలి మూడు చిత్రాలూ విజయవంతం అవ్వడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ‘మసూద’ కోసం నేను వేసిన డంప్ యార్డ్ సెట్‌కి మంచి గుర్తింపు దక్కింది. ఇక్కడ రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. ప్యాషన్ కూడా చాలా అవసరం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. అదే నా విజయ రహస్యం’’ అన్నారు.