సందేశాత్మకంగా...
ABN , First Publish Date - 2023-09-11T01:50:49+05:30 IST
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై రూపొందుతున్న 116వ చిత్రం ‘సిగ్గు’. ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది...

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై రూపొందుతున్న 116వ చిత్రం ‘సిగ్గు’. ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లాప్ ఇచ్చారు. రచయిత కె. విజయేంద్రప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి. వి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమాలో మంచి సందేశం ఉంది, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.