కేరళ వరదల నేపథ్యంలో...

ABN , First Publish Date - 2023-05-23T04:17:26+05:30 IST

కొత్త తరహా కథలకు మలయాళ చిత్రసీమ పెట్టింది పేరు. అక్కడి నుంచి వస్తున్న చిత్రాలు కొన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అందులో ‘2018’ ఒకటి. జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది..

కేరళ వరదల నేపథ్యంలో...

కొత్త తరహా కథలకు మలయాళ చిత్రసీమ పెట్టింది పేరు. అక్కడి నుంచి వస్తున్న చిత్రాలు కొన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అందులో ‘2018’ ఒకటి. జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. 2018 ఆగస్టులో కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. అకాల వర్షాలతో కేరళ అట్టుడికి పోయింది. ఈ వరదల్లో 164మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చుట్టూ అల్లుకొన్న కథ ఇది. కుల్చాకో బోబన్‌, వినీత్‌ శ్రీనివాసన్‌, అసిఫ్‌ అలీ, లాల్‌, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. పది రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. బన్నీ వాస్‌ ఈ చిత్రానికి నిర్మాత. సోమవారం ట్రైలర్‌ బయటకు వచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.

Updated Date - 2023-05-23T04:17:26+05:30 IST