‘జిలేబీ’ రుచుల్లో...

ABN , First Publish Date - 2023-05-07T03:38:29+05:30 IST

కె.విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జిలేబీ’. ఆయన తనయుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. శివానీ రాజశేఖర్‌ కథానాయిక. గుంటూరు రామకృష్ణ నిర్మాత...

‘జిలేబీ’ రుచుల్లో...

కె.విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జిలేబీ’. ఆయన తనయుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. శివానీ రాజశేఖర్‌ కథానాయిక. గుంటూరు రామకృష్ణ నిర్మాత. ఇటీవల బ్యాంకాక్‌లో రెండు పాటల్ని తెరకెక్కించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘అన్ని రకాల రుచులూ ఉండే ఆహ్లాదకరమైన చిత్రమిది. విజయ్‌ భాస్కర్‌ చిత్రాలన్నీ కుటుంబ సభ్యులతో చూసేలా ఉంటాయి. ‘జిలేబీ’ కూడా అదే జాబితాలో చేరుతుంద’’న్నారు.

Updated Date - 2023-05-07T03:38:29+05:30 IST