రాజమౌళి సమర్పణలో...‘మేడ్ ఇన్ ఇండియా’
ABN , First Publish Date - 2023-09-20T01:04:26+05:30 IST
భారతీయ చలన చిత్ర చరిత్రకు తెరరూపం ఇస్తున్న చిత్రం ‘మేడిన్ ఇండియా’. దర్శక ధీరుడు ఎస్.ఎ్‌స.రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం...

భారతీయ చలన చిత్ర చరిత్రకు తెరరూపం ఇస్తున్న చిత్రం ‘మేడిన్ ఇండియా’. దర్శక ధీరుడు ఎస్.ఎ్‌స.రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారు. వరుణ్ గుప్తా, ఎస్.ఎ్‌స.కార్తికేయ నిర్మాతలు. మరాఠీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘‘భారతీయ సినిమాకు పునాది ఎక్కడ పడింది? ఆ తరవాత ఏ విధంగా ఎదిగింది? అనే విషయాల చుట్టూ నడిచే కథ ఇది. భారతీయ చలన చిత్రసీమ బయోపిక్‌లా ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’ని నిర్మాతలు తెలిపారు.