పోలీస్‌ కస్టడీలో...

ABN , First Publish Date - 2023-01-02T03:31:08+05:30 IST

నాగచైతన్య - వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘కస్టడీ’. ‘హంట్‌’ అనేది ఉపశీర్షిక...

పోలీస్‌ కస్టడీలో...

నాగచైతన్య - వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘కస్టడీ’. ‘హంట్‌’ అనేది ఉపశీర్షిక. కృతి శెట్టి కథానాయిక. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఆదివారం గ్లింప్ప్‌ విడుదల చేశారు. ఇదో పోలీస్‌ కథ. యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకొంటోంది. మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా కలిసి సంగీతం అందించడం విశేషం. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నారు. ప్రియమణి, శరత్‌ కుమార్‌, ప్రేమ్‌జీ, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు.

Updated Date - 2023-01-02T03:31:08+05:30 IST

Read more