రాజుగారి అమ్మాయి ప్రేమలో...
ABN , First Publish Date - 2023-08-30T04:46:48+05:30 IST
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’. సత్యరాజ్ దర్శకుడు. రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు...

రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’. సత్యరాజ్ దర్శకుడు. రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘లవ్ యు’ అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. రోషన్ సాలూరి సంగీతం అందించారు. యాజిన్ నిజర్, నూతన్ మోహన్ ఆలపించారు. రెహమాన్ రాశారు. ‘‘యూత్‌కి నచ్చే గీతమిది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలోనే ట్రైలర్ ఆవిష్కరిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.