కోట బొమ్మాళీ పోలీస్‌ స్టేషన్‌లో..

ABN , First Publish Date - 2023-08-01T03:10:56+05:30 IST

శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళీ పీ.ఎస్‌’. జీఏ 2 పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది...

కోట బొమ్మాళీ పోలీస్‌ స్టేషన్‌లో..

శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళీ పీ.ఎస్‌’. జీఏ 2 పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాతలు. తేజ మార్నీ దర్శకుడు. సోమవారం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘నాయట్టు’ చిత్రానికి రీమేక్‌ ఇది. పోలీసు వ్యవస్థకీ, రాజకీయ నాయకులకూ మధ్య జరిగే డ్రామా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఛాయాగ్రహణం: జగదీశ్‌ చీకాటి, రూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్‌, సంభాషణలు: నాగేంద్ర కాశీ.

Updated Date - 2023-08-01T03:10:56+05:30 IST