సైడ్‌ ఎ కి కొనసాగింపుగా...

ABN , First Publish Date - 2023-11-10T02:21:11+05:30 IST

‘నా సినిమాల కోసం నేను హైదరాబాద్‌ రావడం ఇది నాలుగోసారి. నన్ను ఆదిరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘సప్త సాగరాలు దాటి ’సైడ్‌ బి చిత్రాన్ని తెలుగులో ఇంత ఘనంగా విడుదల...

సైడ్‌ ఎ కి కొనసాగింపుగా...

‘నా సినిమాల కోసం నేను హైదరాబాద్‌ రావడం ఇది నాలుగోసారి. నన్ను ఆదిరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘సప్త సాగరాలు దాటి ’సైడ్‌ బి చిత్రాన్ని తెలుగులో ఇంత ఘనంగా విడుదల చేస్తున్న పీపుల్‌ మీడియా సంస్థకు కృతజ్ఞతలు’ అన్నారు కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి. ఆయన నటించిన ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బి’ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనరుపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రక్షిత్‌ శెట్టి పాల్గొన్నారు. హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ మాట్లాడుతూ ‘మను, ప్రియల కథ మీ హృదయాల్లో చోటు సంపాదించుకోవడం ఆనందంగా ఉంది. ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ ఎ ’లాగే సైడ్‌ బి కూడా మిమ్మల్ని మెప్పిస్తుంది’ అన్నారు. చిత్ర దర్శకుడు హేమంతరావు మాట్లాడుతూ ‘సైడ్‌ ఎ కి కొనసాగింపుగా సైడ్‌ బి కథ ఉంటుంది. కన్నడ వెర్షన్‌కు మంచి స్పందన రావడం చూసి తెలుగులో విడుదల చేయాలని అనుకున్నాం’ అన్నారు. నిర్మాత వివేక్‌ కూబిభొట్ల మాట్లాడుతూ ‘ఇప్పుడు సమయం ఉంది కాబట్టి సైడ్‌ బి చిత్రానికి మరింత ఎక్కువ పబ్లిసిటీ చేస్తాం. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని మా నమ్మకం’ అన్నారు.

Updated Date - 2023-11-10T02:21:13+05:30 IST