పోరాట ఘట్టాల్లో

ABN , First Publish Date - 2023-08-11T02:39:42+05:30 IST

సుమన్‌, గరీమా చౌహాన్‌ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీశ్‌ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్‌ నిర్మిస్తున్నారు...

పోరాట ఘట్టాల్లో

సుమన్‌, గరీమా చౌహాన్‌ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీశ్‌ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్‌ నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ పోచంపల్లి పరిసర ప్రాంతాల్లో మొదలైంది. నల్లమల అటవీ ప్రాంతంలో వందమంది ఫైటర్లతో భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. గగన్‌ విహారి, నాగినీడు, శివాజీరాజా, రచ్చరవి కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: చరణ్‌ అర్జున్‌. సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ వనమాలి

Updated Date - 2023-08-11T02:39:42+05:30 IST