దిల్‌రాజు ప్రొడక్షన్‌లో

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:42 AM

ఒక్క హిట్‌ రాగానే చకచకా పది సినిమాలకు సైన్‌ చేసేస్తుంటారు నేటి హీరోయిన్లు. కానీ ’బేబీ‘ లాంటి హిట్‌ తర్వాత కూడా ఆచీతూచీ సినిమాలు చేస్తున్నారు వైష్ణవి చైతన్య...

దిల్‌రాజు ప్రొడక్షన్‌లో

ఒక్క హిట్‌ రాగానే చకచకా పది సినిమాలకు సైన్‌ చేసేస్తుంటారు నేటి హీరోయిన్లు. కానీ ’బేబీ‘ లాంటి హిట్‌ తర్వాత కూడా ఆచీతూచీ సినిమాలు చేస్తున్నారు వైష్ణవి చైతన్య. తాజాగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాకు ఆమె ఓకే చెప్పారు. ఆశిష్‌ ఇందులో కథానాయకుడు. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. యువతరం మెచ్చే చక్కని ప్రేమకథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఆస్కార్‌ విన్నర్‌ ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్న ఈ సినిమాకు జాతీయ ఉత్తమ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారని, మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వారు చెప్పారు. హ ర్షిత్‌రెడ్డి, హన్షిత, నాగ మిల్లిడి ఈ చిత్రానికి నిర్మాతలు. సమర్పణ: శిరీష్‌.

Updated Date - Dec 29 , 2023 | 12:42 AM