క్రిస్ప్‌ స్ర్కీన్‌ప్లేతో ఆకట్టుకొంటుంది

ABN , First Publish Date - 2023-11-21T00:11:35+05:30 IST

స్పందన వల్లి, యుగ్‌రామ్‌, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించిన ‘ద ట్రయల్‌’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్‌ గన్ని మీడియాకు చెప్పిన విశేషాలు...

క్రిస్ప్‌ స్ర్కీన్‌ప్లేతో ఆకట్టుకొంటుంది

స్పందన వల్లి, యుగ్‌రామ్‌, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించిన ‘ద ట్రయల్‌’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్‌ గన్ని మీడియాకు చెప్పిన విశేషాలు.

  • నా పూర్తి పేరు రామానాయుడు గన్ని. సినిమాల మీద ఫ్యాషన్‌తో ఉద్యోగం వదులుకుని ఇక్కడికి వచ్చా. ‘సెహరి’ సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేశా. అప్పుడే ‘ద ట్రయల్‌’ కథ రాసుకున్నా.. డిప్యూటీ జైలర్‌గా నా పదేళ్ల కెరీర్‌లో ఎన్నో క్రైమ్‌ ఇన్సిడెంట్స్‌ గురించి, నేరాలు చేసిన ఖైదీల గురించి విన్నాను. వాటి ప్రభావం ‘ద ట్రయల్‌’ కథ మీద కొంత ఉంది. విదేశాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మనకు అన్వయించుకుంటే ఎలా ఉంటుందని ఫిక్షనల్‌గా రాసుకున్న కథ ఇది. ఇందులో రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌ ఉన్నా ఫాంటసీ కూడా ఉంటుంది. ఫాంటసీ లేకపోతే సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు.

  • టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్‌ ఇంటారాగేషన్‌ ఫిల్మ్‌. ఇంతవరకూ మన సినిమాల్లో కొన్ని ఇంటరాగేషన్‌ సీన్లు ఉన్నాయి కానీ మొత్తం సినిమా ఇంటరాగేషన్‌ మీద రాలేదు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ ఓటీటీకి ఇవ్వాలంటే థియేటర్‌లో రిలీజ్‌ తప్పనిసరి అంటున్నారు. ఈ సినిమాకు ‘విచారణ’ అని పేరు పెట్టవచ్చు. కానీ ‘ద ట్రయల్‌’ అన్నది యాప్ట్‌ టైటిల్‌.

  • సినిమా నిడివి ఒక గంట 39 నిమిషాలు. స్ర్కీన్‌ప్లే చాలా క్రిస్ప్‌గా ఉంటుంది. ఎక్కడా విసుగు పుట్టదు. పీవీఆర్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. మా కంటెంట్‌ మీద నమ్మకం ఉంది.

Updated Date - 2023-11-21T00:11:37+05:30 IST