ఆ ఒక్క ఓటు కావాలంటే...?

ABN , First Publish Date - 2023-10-15T04:01:04+05:30 IST

సంపూర్ణేష్‌ బాబు, వికె.నరేశ్‌, శరణ్య ప్రదీప్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఎస్‌.శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు...

ఆ ఒక్క ఓటు కావాలంటే...?

సంపూర్ణేష్‌ బాబు, వికె.నరేశ్‌, శరణ్య ప్రదీప్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఎస్‌.శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు. ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఇదో పొలిటికల్‌ డ్రామా. మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ చెప్పులు కుట్టుకొనే వ్యక్తి. తన ఊర్లో ఎన్నికలు వస్తాయి. గెలుపోటములు నిర్ణయించే శక్తి మార్టిన్‌ ఓటుకు వస్తుంది. ఆ సమయంలో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో ఆసక్తికరం. ఈనెల 18న ట్రైలర్‌ విడుదల చేస్తున్నామ’’న్నారు. ఈ చిత్రానికి స్ర్కీన్‌ ప్లే, డైలాగ్స్‌: వెంకటేశ్‌ మహా.

Updated Date - 2023-10-15T04:01:04+05:30 IST