పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతా!

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:26 AM

తనకు పెళ్లైందంటూ సోష్‌ల్‌ మీడియాలో వస్తున్న వార్తలను హీరోయున్‌ శ్రుతీహాసన్‌ ఖండించారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌ ఓర్హాన్‌ అవత్రమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...

పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతా!

తనకు పెళ్లైందంటూ సోష్‌ల్‌ మీడియాలో వస్తున్న వార్తలను హీరోయున్‌ శ్రుతీహాసన్‌ ఖండించారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌ ఓర్హాన్‌ అవత్రమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘శ్రుతీహాసన్‌కు పెళ్లైంది’ అని పరోక్షంగా చెప్పాడు. ‘శ్రుతీహాసన్‌కు పొగరెక్కువ. కానీ ఆమె భర్త శంతను నాకు మంచి ఫ్రెండ్‌’ అని ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పాడు. దాంతో శ్రుతీహాసన్‌ రహస్యంగా శంతనను పెళ్లాడి ఉంటారనే ఊహగానాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై శ్రుతీహాసన్‌ స్పందించారు. ‘నాకు సంబంధించిన ప్రతి విషయం మీతో పంచుకుంటున్నాను. అలాంటిది పెళ్లి చేసుకున్న విషయాన్ని మీ దగ్గర ఎందుకు దాస్తాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, అబద్దపు ప్రచారాలను నమ్మవద్దు’ అని శ్రుతీహాసన్‌ చెప్పారు. బాయ్‌ఫ్రెండ్‌ శంతనుతో కొన్నేళ్లుగా ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె అడివి శేష్‌ సరసన ‘డెకాయిట్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 01:26 AM