సమరం మొదలెడితే... సంతకం నాదే
ABN , First Publish Date - 2023-11-28T06:14:35+05:30 IST
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. మాళవిక శర్మ కథానాయిక. సునీల్, జేపీ కీలక పాత్రలు పోషించారు...
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. మాళవిక శర్మ కథానాయిక. సునీల్, జేపీ కీలక పాత్రలు పోషించారు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. సోమవారం టీజర్ ఆవిష్కరించారు. టీజర్‌లో ‘సమరం మొదలెడితే సంతకం నాదే అవ్వాలి’ అనే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్‌కి అద్దం పడుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇది. రాయససీమ యాసని పాత్రధారులు బాగా ఆకళింపు చేసుకొన్నట్టు అర్థం అవుతోంది. సాధారణ వ్యక్తి స్థాయి నుంచి శక్తిమంతమైన యువకుడిగా హీరో ఎదిగిన ప్రయాణమే ఈ కథ. సునీల్ లుక్ కూడా కొత్తగా కనిపిస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం కొత్త టెంపోలో సాగింది. విజువల్ గానూ ఈ సినిమా భారీగా కనిపిస్తోంది. 2024 ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.