అలా జరక్కపోతే నన్ను నిలదీయండి!

ABN , First Publish Date - 2023-08-04T02:57:40+05:30 IST

‘‘దయా అనేది ఓ వెబ్‌ సిరీస్‌. అయితే సినిమాలానే ఒక్కసారి మొదలైతే నాన్‌ స్టాప్‌గా చూస్తారు. ఎక్కడా పాజ్‌ చేయరు. అలా చేస్తే ఫిల్మ్‌నగర్‌లో...

అలా జరక్కపోతే నన్ను నిలదీయండి!

‘‘దయా అనేది ఓ వెబ్‌ సిరీస్‌. అయితే సినిమాలానే ఒక్కసారి మొదలైతే నాన్‌ స్టాప్‌గా చూస్తారు. ఎక్కడా పాజ్‌ చేయరు. అలా చేస్తే ఫిల్మ్‌నగర్‌లో ఎక్కడ కనిపించినా నన్ను నిలదీయండి’’ అన్నారు పవన్‌ సాధినేని. ఆయన దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘దయా’. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీషన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం నుంచి హాట్‌ స్టార్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఔత్సాహిక నటీనటులకు ఈ వెబ్‌ సిరీస్‌ ఓ గైడ్‌లా ఉంటుంది. అందరూ అంత బాగా నటించారు. మహిళా పాత్రలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంద’’న్నారు. ‘‘దయాలోని ప్రతీ ఎపిసోడ్‌ కొన్ని ప్రశ్నలతో ముగుస్తుంది. ఆ ప్రశ్నలు కథలో మరింత ఆసక్తి పెంచే విధంగా ఉంటాయి. రాంగోపాల్‌ వర్మ తరవాత నేను పని చేసిన దర్శకుల్లో పవనే ది బెస్ట్‌’’ అన్నారు జేడీ చక్రవర్తి. ‘‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నేను చేయగలనా? అనిపించింది. ఇప్పుడు ఈ సిరీస్‌ మొత్తం చూశాక.. భవిష్యత్తులోనూ నాకు ఇలాంటి పాత్రలే వస్తాయేమో అని భయం వేస్తోంద’’న్నారు ఈషా రెబ్బా.

Updated Date - 2023-08-04T02:57:40+05:30 IST