జయ విజయులు మళ్లీ జన్మిస్తే

ABN , First Publish Date - 2023-08-20T02:04:42+05:30 IST

నవీన్‌ బేతిగంటి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకత్వంలో దామురెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు...

జయ విజయులు మళ్లీ జన్మిస్తే

నవీన్‌ బేతిగంటి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకత్వంలో దామురెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దాము రెడ్డి మాట్లాడుతూ ‘పురాణాలను నేటి సామాజిక పరిస్థితులకు అన్వయిస్తూ, ఒక కొత్త తరహా కథతో నిర్మించాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పురాణాల ప్రకారం జయ విజయులు ఒక్కో యుగంలో పలు రాక్షస రూపాల్లో జన్మించారు. కలియుగంలో వారు జన్మిస్తే ఏం జరుగుతుందనే పాయింట్‌ చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తీశా’మన్నారు.

Updated Date - 2023-08-20T02:04:42+05:30 IST