సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ధైర్యానికి అదృష్టం తోడైతే...

ABN, First Publish Date - 2023-01-27T04:48:50+05:30

సత్యదేవ్‌, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రధారులుగా ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యదేవ్‌, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రధారులుగా ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎస్‌.ఎన్‌.రెడ్డి, బాల సుందరం, దినేశ్‌ సుందరం నిర్మాతలు. ఈ చిత్రానికి ‘జీబ్రా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అనేది ఉపశీర్షిక. ప్రియా భవానీ శంకర్‌, జెనిఫర్‌ పిచినెటో కథానాయికలు. సత్యరాజ్‌ కీలక పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాసల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్‌, కొలకొత్తా, ముంబై తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరపనున్నారు. ‘‘కథకు తగిన టైటిల్‌ ఇది. కథ, కథనాలు చదరంగం ఆటని పోలి ఉంటాయి. ఏ ఆటలో అయినా గెలవాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. ధైర్యానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో సత్యదేవ్‌ పాత్ర అలా ఉంటుంద’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: రవి బస్రూర్‌.

Updated Date - 2023-01-27T04:48:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!