నింగినై నిన్ను చూస్తుంటా...

ABN , First Publish Date - 2023-09-13T00:14:50+05:30 IST

అభయ్‌, నవీన్‌, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేశ్‌ ప్రఽధాన పాత్రలు పోషించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మాతలు...

నింగినై నిన్ను చూస్తుంటా...

అభయ్‌, నవీన్‌, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేశ్‌ ప్రఽధాన పాత్రలు పోషించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మాతలు. అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం ‘నింగినై చూస్తుంటా’ అనే గీతాన్ని విడుదల చేశారు. మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యం అందించారు. రాజీవ్‌-శ్రీకాంత్‌ స్వరాలు అందించారు. శివానీ పాడారు. ‘‘మన పురాణాల్ని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తీర్చిదిద్దిన చిత్రమిది. కథ, కథనాలు ఆకట్టుకొంటాయి. ‘నింగినై..’ అంటూ సాగే ఈ అమ్మ పాట అందరి హృదయాల్ని హత్తుకొంటుంద’’ని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-09-13T00:14:50+05:30 IST