సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంచి నటుడిగా గుర్తింపు పొందాలనుంది

ABN, First Publish Date - 2023-07-31T03:17:01+05:30

‘హీరో పాత్రలతో పాటు అవకాశం వస్తే విలన్‌గా అయినా నటించడానికి నేను సిద్ధం. మంచి నటుడిగా ఎదగాలన్నదే నా లక్ష్యం’ అని నిరోజ్‌ పుచ్చా అన్నారు...

‘హీరో పాత్రలతో పాటు అవకాశం వస్తే విలన్‌గా అయినా నటించడానికి నేను సిద్ధం. మంచి నటుడిగా ఎదగాలన్నదే నా లక్ష్యం’ అని నిరోజ్‌ పుచ్చా అన్నారు. ఇటీవలె విడుదలైన ‘భారతీయన్స్‌’ చిత్రంతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చి, విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నిరోజ్‌ మాట్లాడుతూ ‘నటనపైన మక్కువతో సినీ పరిశ్రమలోకి వచ్చాను. మొదట్లో లఘు చిత్రాల్లో నటించాను. తర్వాత వెబ్‌సిరీస్‌లు చేశాను. దీన్‌రాజ్‌ ‘భారతీయన్స్‌’ చిత్రంలో అవకాశం ఇచ్చి నా కెరీర్‌ను మలుపు తిప్పారు. ఈ సినిమాలో చేసిన పాత్ర నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. నా తర్వాతి చిత్రంలో ఓ నెగిటివ్‌ రోల్‌ చేస్తున్నాను. సెప్టెంబర్‌లో విడుదలవుతుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలసి నటించాలనేది నా కోరిక’ అని చెప్పారు.

Updated Date - 2023-07-31T03:17:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!