జరగాల్సిందే జరుగుతుందని అర్థమైంది

ABN , First Publish Date - 2023-11-16T00:57:40+05:30 IST

శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్‌’. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీవాస్‌, విద్యా కొప్పినీడు నిర్మించారు...

జరగాల్సిందే జరుగుతుందని అర్థమైంది

శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్‌’. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీవాస్‌, విద్యా కొప్పినీడు నిర్మించారు. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివానీ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

  • ఇందులో లేడీ కానిస్టేబుల్‌ పాత్ర పోషించాను. నాన్న చాలా సినిమాల్లో పోలీస్‌ పాత్రల్లో నటించారు. ఆయన నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకున్నాను.

  • ‘లింగిడి లింగిడి’ పాటతో సినిమా జనాల్లోకి వెళ్లింది. నాక్కూడా మంచి గుర్తింపు వచ్చింది. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్‌. కానీ మన వాతావరణానికి తగ్గట్లు చాలా మార్పులు చేశారు. గ్లామర్‌ హీరోయిన్‌గా గుర్తింపు కోసం నేను ఆరాటపడడం లేదు. మనం ఎంత కోరుకున్నా జరగాల్సిందే జరుగుతుందని అర్థమైంది. మనచేతిలో ఉన్నది కష్టపడడం మాత్రమే. నచ్చింది చేసుకుంటూ పోవడాన్ని నేను నమ్ముతాను. గ్లామర్‌ రోల్స్‌ చేయడానికి ఆ తరహా పాత్రల కోసం ఎదురుచూస్తున్నా.

  • శ్రీకాంత్‌ గారిని చిన ్నప్పటి నుంచి చూస్తున్నా. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆయనతో కలసి నటించడం ఆనందంగా ఉంది. సెట్లో సరదాగా ఉంటారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ గారి పాత్ర హైలెట్‌గా ఉంటుంది.

  • మెగా ఫ్యామిలీతో గొడవలు అంతా గతం. ఇప్పుడు బాగానే ఉంటున్నాం. ఇలాంటి విషయాల్లో సంబంధం లేనివాళ్లు ఎక్కువ హడావిడి చేస్తున్నారు.

Updated Date - 2023-11-16T00:57:42+05:30 IST