రెండు నెలలు బాగా కష్టపడ్డాను

ABN , First Publish Date - 2023-10-31T06:04:13+05:30 IST

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ టైటిల్‌ పాత్రలో నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘టైగర్‌ 3’ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చే నెల 13న ఈ చిత్రం విడుదల కానుంది...

రెండు నెలలు బాగా కష్టపడ్డాను

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ టైటిల్‌ పాత్రలో నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘టైగర్‌ 3’ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చే నెల 13న ఈ చిత్రం విడుదల కానుంది. మనీశ్‌ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో లేడీ స్పై జోయా పాత్రను కట్రీనీ కైఫ్‌ పోషించారు హీరోకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. తన పాత్ర గురించి కట్రీనా వివరిస్తూ ‘నేను ఇంతవరకూ చేసిన పాత్రల్లో జోయా చాలా పవర్‌ఫుల్‌. ఈ సినిమాలో జోయా స్టైల్‌ ఆఫ్‌ యాక్షన్‌ యూనిక్‌గా ఉంటుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటించాలనే నా కల ‘టైగర్‌ 3’తో నిజమైంది. టైగర్‌ ఫ్రాంచైజీలో జోయా పాత్ర నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంటుంది. మరింత వేగంగా, బలంగా జోయా ఉండటానికి నేను చాలా కష్టపడ్నాఉ. రెండు నెలలు కఠినమైన శిక్షణ తీసుకున్నాను. నా కెరీర్‌లోనే ఇది కఠినమైన ట్రైనింగ్‌. నేను చేసిన యాక్షన్‌ సీన్లు చూస్తే మరెవ్వరూ ఇలాంటి ప్రయత్నం చేయరేమో! ప్రపంచంలోనే బెస్ట్‌ యాక్షన్‌ టీమ్‌తో కలసి పని చేశాను. జోయా పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేయడానికి కృషి చేశాను. వెండి తెరపై ఆ యాక్షన్‌ సన్నివేశాలు చూస్తూ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని ఆత్రుతగా ఉంది’ అన్నారు.

Updated Date - 2023-10-31T06:04:13+05:30 IST