అడవి అంటే నాకు ఇష్టం

ABN , First Publish Date - 2023-10-27T01:32:12+05:30 IST

అప్సరా రాణి ప్రధాన పాత్ర పోషించిన ‘తలకోన’ చిత్రం నవంబర్‌ రెండో వారంలో విడుదల కానుంది. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌రెడ్డి (చేవెళ్ల) నిర్మిస్తున్నారు...

అడవి అంటే నాకు ఇష్టం

అప్సరా రాణి ప్రధాన పాత్ర పోషించిన ‘తలకోన’ చిత్రం నవంబర్‌ రెండో వారంలో విడుదల కానుంది. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌రెడ్డి (చేవెళ్ల) నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకకు రామ్‌గోపాల్‌ వర్మ, శివాజీ రాజా, నిర్మాత రామారావు అతిధులుగా హాజరయ్యారు. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘నాకు అందం అంటే ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అందమైన అడవిలో అందమైన అప్సరా రాణి డాన్సులు చేస్తూ, ఫైట్లు చేస్తుంటే చూడడానికి అద్భుతంగా ఉంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు ఈ కథ చెప్పగానే థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఎక్కువ భాగం ఫారెస్ట్‌లో షూట్‌ చేశాం. దీని వల్ల కొంత ఇబ్బంది కలిగినా యూనిట్‌ అంతా బాగా సహకరించడంతో చేయగలిగాం. దర్శకుడు బాగా తీశారు’ అన్నారు.

Updated Date - 2023-10-27T01:32:12+05:30 IST