మా అమ్మకి థాంక్స్‌ చెప్పాలి

ABN , First Publish Date - 2023-09-14T00:33:20+05:30 IST

ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌ సంస్థతో కలసి హీరో రవితేజ నిర్మించిన ‘ఛాంగురే బంగారు రాజా’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది...

మా అమ్మకి థాంక్స్‌ చెప్పాలి

ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌ సంస్థతో కలసి హీరో రవితేజ నిర్మించిన ‘ఛాంగురే బంగారు రాజా’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న గోల్డీ నిస్సీ బుధవారం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు

  • నేను తెలుగు అమ్మాయిని. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశా. రవితేజగారి ప్రొడక్షన్‌లో ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలుసుకుని ఆడిషన్‌ ఇచ్చా. నచ్చి నన్ను ఎంపిక చేశారు. ఈ విషయంలో అమ్మకు థాంక్స్‌ చెప్పాలి. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని తనే చాలా ఆడిషన్స్‌కు స్వయంగా తీసుకెళ్లారు.

  • ఈ సినిమాలో నా పాత్ర పేరు మంగరత్నం. పోలీస్‌ కానిస్టేబుల్‌. కొంచెం గ్రే షేడ్‌ ఉంటుంది. బంగారు రాజు ఇష్టపడతాడు. వీరిద్దరి లవ్‌ట్రాక్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్ర ఇది. మంచి కంటెంట్‌ ఉన్న కథలు వస్తే అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది.

Updated Date - 2023-09-14T00:33:20+05:30 IST