తొలి ఆటోగ్రాఫ్ హైదరాబాద్‌లోనే ఇచ్చాను
ABN, First Publish Date - 2023-11-28T06:19:56+05:30
‘‘తెలుగు చిత్రసీమ నాకెంతో ప్రత్యేకం. నా మొదటి సినిమా ప్రమోషన్‌కి హైదరాబాద్ వచ్చా. నా తొలి ఆటోగ్రాఫ్ ఇక్కడే ఇచ్చా’’ అన్నారు రణబీర్ కపూర్...
‘‘తెలుగు చిత్రసీమ నాకెంతో ప్రత్యేకం. నా మొదటి సినిమా ప్రమోషన్‌కి హైదరాబాద్ వచ్చా. నా తొలి ఆటోగ్రాఫ్ ఇక్కడే ఇచ్చా’’ అన్నారు రణబీర్ కపూర్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘యానిమల్’ డిసెంబరు 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా సోమవారం హైదరాబాద్ వచ్చారు. రణబీర్ కపూర్ మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాల్ని ప్రేమించే విధానం అపూర్వం. అది చూసినప్పుడల్లా రెండు తెలుగు రాష్ర్టాలు నన్ను దత్తత తీసుకొంటే బాగుంటుంది అనిపిస్తుంది. జంతువుల స్వభావాన్ని, వాటి ప్రవర్తననీ మనం ఊహించలేం. ఈ సినిమాలో నా పాత్ర కూడా అలానే ఉంటుంది. అందుకే ‘యానిమల్’ అనే పేరు పెట్టాం’’ అన్నారు. ‘‘నా పునాది దక్షిణాదిలోనే పడింది. నా తొలి చిత్రం ‘వంశ వృక్షం’ బాపు గారి దర్శకత్వంలో నటించాను . ‘యానిమల్’ తెలుగులో నా రెండో సినిమా. సందీప్ రెడ్డి కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా’’ అని అనిల్ కపూర్ చెప్పారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘‘రణబీర్ కపూర్ నాకంటే యేడాది చిన్నోడు. లేదంటే తన నటనకు కాళ్లు మొక్కేవాడ్ని. అంత గొప్ప ప్రతిభ కనబరిచాడ’’న్నారు. ‘‘సందీప్ రెడ్డి కథల్ని, పాత్రల్ని మలిచే తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమాలో నాక్కూడా ఓ గొప్ప పాత్ర దొరికింద’’న్నారు రష్మిక.