అవార్డుల్ని ఆశించి పని చేయను!

ABN , First Publish Date - 2023-03-26T00:46:39+05:30 IST

‘మహానటి’తో జాతీయ పురస్కారం అందుకొన్నారు కీర్తి సురేశ్‌. అప్పటి నుంచీ ఆమె ప్రయాణం, కథల ఎంపిక అన్నీ మారిపోయాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకొంటున్నారు...

అవార్డుల్ని ఆశించి పని చేయను!

‘మహానటి’తో జాతీయ పురస్కారం అందుకొన్నారు కీర్తి సురేశ్‌. అప్పటి నుంచీ ఆమె ప్రయాణం, కథల ఎంపిక అన్నీ మారిపోయాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకొంటున్నారు. ‘దసరా’లోని వెన్నెల పాత్ర కూడా అలాంటిదేనట. మరి ఈ పాత్రకు సైతం అవార్డు వస్తుందా? అని కీర్తిని అడిగితే.. ‘‘నేనెప్పుడూ అవార్డుల్ని ఆశించి పని చేయను. ‘మహానటి’ సమయంలోనూ నాకు అవార్డు వస్తుందనుకోలేదు. ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే పురస్కారాలు దక్కాయి. ఇప్పుడు కూడా అంతే’’ అన్నారు. బాలీవుడ్‌ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ‘‘మహానటి తరవాత బాలీవుడ్‌ నుంచి చాలా కథలు వచ్చాయి. కానీ... నాకు అంతగా నచ్చలేదు. ‘దసరా’ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో వెళ్తోంది. ఈ సినిమా తరవాత నాకు అక్కడి నుంచి మరిన్ని అవకాశాలు వస్తాయనుకొంటున్నా. నేను పారితోషికం బాగా పెంచేశానన్న వార్తల్లో నిజం లేదు. నేను అడిగినంత మాత్రాన రెమ్యునరేషన్‌ పెంచరు. అది కూడా ఓ పద్ధతి ప్రకారమే పెరుగుతుంటుంద’’న్నారు.

Updated Date - 2023-03-26T00:46:41+05:30 IST