ఈ సినిమా కోసం రెండేళ్లు రీసెర్చ్‌ చేశా

ABN , First Publish Date - 2023-10-18T03:04:48+05:30 IST

ప్రతి దర్శకుడికి ఓ బయోపిక్‌ చేయాలని ఉంటుంది. కమల్‌ హాసన్‌ నటించిన ‘నాయకుడు’ చిత్రం నాకు చాల ఇష్టం. చిన్నతనంలోనే నా మనసుకి దగ్గరైన చిత్రమది. అందుకే నేను కూడా ఓ బయోపిక్‌ తీయాలని...

ఈ సినిమా కోసం రెండేళ్లు రీసెర్చ్‌ చేశా

ప్రతి దర్శకుడికి ఓ బయోపిక్‌ చేయాలని ఉంటుంది. కమల్‌ హాసన్‌ నటించిన ‘నాయకుడు’ చిత్రం నాకు చాల ఇష్టం. చిన్నతనంలోనే నా మనసుకి దగ్గరైన చిత్రమది. అందుకే నేను కూడా ఓ బయోపిక్‌ తీయాలని అనుకున్నాను. అందుకే టైగర్‌ నాగేశ్వరరావు సినిమా తీశాను’ అన్నారు దర్శకుడు వంశీకృష్ణ. రవితేజ హీరోగా ఆయన రూపొందించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం ఈ నెల 20న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

  • టైగర్‌ నాగేశ్వరరావు గురించి రెండేళ్లు రీసెర్చ్‌ చేశాను. ఆయన కుటుంబ సభ్యులను, కొంతమంది పోలీస్‌ అధికారులను కలిశాను. చాలా విషయాలు తెలిశాయి. మనకు తెలిసినంతవరకూ ఆయన ఒక దొంగే. కానీ ఆయన ఇన్నర్‌ సోల్‌ ఎవరికీ తెలీదు. అది సినిమాలో చూపించాం. టైగర్‌ నాగేశ్వరావు అంటే ఒక ఎమోషన్‌. ఆయనలో రెండు కోణాలు ఉన్నాయి. రెండూ తీవ్రంగానే ఉంటాయి

  • తెలిసిన విషయాన్ని ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పడం కష్టంతో కూడుకున్న పని. టైగర్‌ నాగేశ్వరరావు గురించి కొంత సమాచారమే తెలుసు. దాన్ని ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేస్తూ ఆసక్తిగా చెప్పడం సవాల్‌తో కూడుకున్న పనే.

  • ఫ నాగేశ్వరరావు గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఆధారాలు లేవు. ట్రైన్‌తో సమానంగా పరిగెత్తి రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కేవారని చెబుతారు. చెప్పి మరీ దొంగతనాలు చేసే వారట. ఇలా ఎన్నో సంఘటనలు విన్నా దేనికీ ఆధారాలు లేవు. అందుకే ఈ సినిమా టైటిల్స్‌లో ‘నిజమైన రూమర్స్‌ ఆధారంగా..’ అని వేశాం.

  • రవితేజగారు మొదట ఫస్ట్‌ హాఫ్‌ విన్నారు. మిగతాది తర్వాతి రోజు విన్నారు. క్లైమాక్స్‌ చెబుతుండగానే ఆయన లేచి నిలబడి ‘జుట్టు ఇలా పెంచితే బాగుంటుందా? లెన్స్‌ పెట్టుకోనా? అని అడిగారు. అది నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది.

  • ఇంత పెద్ద సినిమా చేయాలంటే నిర్మాతకు దర్శకుడిపై ఎంతో నమ్మకం ఉండాలి. అభిషేక్‌ గారికి నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన నిర్మాతలా కాకుండా ఓ ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటారు. నేను ఏది అడిగినా ఆయన కాదనలేదు. అభిషేక్‌గారి సపోర్ట్‌ వల్లే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది.

Updated Date - 2023-10-18T03:04:48+05:30 IST