కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ నమ్మకంతోనే షూటింగ్‌కు వెళ్లలేదు

ABN, First Publish Date - 2023-09-11T01:54:33+05:30

‘‘సతీష్‌ చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. కథనూ, అతన్నీ నమ్మాను. అందుకే షూటింగ్‌లో జోక్యం చేసుకోలేదు. ఒక్కరోజు కూడా ‘ఛాంగురే బంగారు రాజా’ షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లలేదు’’ అని రవితేజ అన్నారు...

‘‘సతీష్‌ చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. కథనూ, అతన్నీ నమ్మాను. అందుకే షూటింగ్‌లో జోక్యం చేసుకోలేదు. ఒక్కరోజు కూడా ‘ఛాంగురే బంగారు రాజా’ షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లలేదు’’ అని రవితేజ అన్నారు. సతీష్‌ వర్మ దర్మకత్వంలో ఆయన నిర్మించిన చిత్రమిది. కార్తిక్‌ రత్నం, సత్య జంటగా నటించారు. ఈనెల 15న విడుదలవుతోంది. ఆదివారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘కార్తిక్‌ చాలా బాగా నటించాడు. ఈ సినిమా రిలీజయ్యాక అందరికీ మంచి పేరు తెస్తుంది’ అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘రవితేజ నన్ను చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా విజయం అందుకోవాల’ని ఆకాంక్షించారు. ఈ సినిమాలో తొలిసారి ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్టైన్‌ రోల్‌ చే శాను అని కార్తిక్‌ రత్నం చెప్పారు. సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో రవితేజ సహకారం మరువలేనిదని సతీష్‌ వర్మ తెలిపారు.

Updated Date - 2023-09-11T01:54:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!