సినిమా కోసం వేసిన సెట్‌ అంటే నమ్మలేదు

ABN , First Publish Date - 2023-03-16T02:32:10+05:30 IST

నాని కథానాయకుడిగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్లా సినిమా విశేషాలను వివరించారు...

సినిమా కోసం వేసిన సెట్‌ అంటే నమ్మలేదు

నాని కథానాయకుడిగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్లా సినిమా విశేషాలను వివరించారు.

  • కథానుసారం పాతికేళ్ల క్రితం నాటి గ్రామం సినిమాలో కనిపిస్తుంది. ఇల్లు, స్కూల్‌, మైదానం, బార్‌.. ఇవన్నీ ఉండేలా 22 ఎకరాల్లో ఒక పెద్ద గ్రామాన్నే సృష్టించాం.

  • 98 శాతం షూటింగ్‌ సెట్‌లోనే జరిగింది. ఎనిమిది వందల మంది రేయింబవళ్లు పనిచేస్తే, సెట్‌ వేయడానికి రెండున్నర నెలలు పట్టింది. చిత్రీకరణకు వంద రోజులు పట్టింది.

  • ఎలక్ర్టిసిటీ బోర్డ్‌ అధికారులు మా సెట్‌కి వచ్చి ‘ఈ ఊళ్లో అనుమతి లేకుండా కరెంట్‌ వాడుతున్నారు’ మీటర్‌ చూపించమని దబాయించారు. ‘ఇది నిజమైన ఊరు కాదు సినిమా కోసం వేసిన సెట్‌’ అంటే ఓ పట్టాన నమ్మలేదు.

  • శ్రీకాంత్‌కి చాలా స్పష్టత ఉంది. ఆయనది తెలంగాణ నేపథ్యం. తన ఊరిని దృష్టిలో ఉంచుకొనే ఆయన కథ రాసుకున్నారు. కథ, దర్శకుడిపైన నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారు.

Updated Date - 2023-03-16T02:32:10+05:30 IST