నేనే అవకాశం అడిగాను

ABN , First Publish Date - 2023-08-27T02:32:38+05:30 IST

‘నా ఇన్నేళ్ల నట జీవితంలో ‘చంద్రముఖి 2’ లాంటి గొప్ప సినిమా చేయలేదు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని దర్శకుడు పి. వాసు గారిని నేనే అడిగాను’ అని కంగనా రనౌత్‌ చెప్పారు...

నేనే అవకాశం అడిగాను

‘నా ఇన్నేళ్ల నట జీవితంలో ‘చంద్రముఖి 2’ లాంటి గొప్ప సినిమా చేయలేదు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని దర్శకుడు పి. వాసు గారిని నేనే అడిగాను’ అని కంగనా రనౌత్‌ చెప్పారు. రాఘవ లారెన్స్‌తో కలసి ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. సెప్టెంబర్‌ 15న విడుదలవుతోంది. ఇటీవలే చెన్నైలో ఆడియో విడుదల కార్యకమ్రం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ ‘కంగనా రనౌత్‌ ‘చంద్రముఖి 2’లో నటి స్తారని తెలియగానే చాలా టెన్షన్‌ పడ్డాను. ఆమె అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయారు. ‘లైకా లాంటి పెద్ద నిర్మాణ సంస్థ వల్ల ‘చంద్రముఖి 2’ను గొప్పగా తెరకెక్కించగలిగాం. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం ప్రత్యేకాకర్షణ అని పి. వాసు చెప్పారు. రాఘవ లారెన్స్‌ సపోర్ట్‌తో మంచి సంగీతం ఇవ్వగలిగాను అని కీరవాణి చెప్పారు.

Updated Date - 2023-08-27T02:32:38+05:30 IST