నేను మీ వీరాభిమానిని కంగనను పొగిడిన జ్యోతిక

ABN , First Publish Date - 2023-09-08T02:14:45+05:30 IST

పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రం బాక్సాఫీసును షేక్‌ చేసింది. రజనీకాంత్‌, నయనతార, ప్రభు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో చంద్రముఖిగా జ్యోతిక నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది...

నేను మీ వీరాభిమానిని కంగనను పొగిడిన జ్యోతిక

పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రం బాక్సాఫీసును షేక్‌ చేసింది. రజనీకాంత్‌, నయనతార, ప్రభు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో చంద్రముఖిగా జ్యోతిక నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన హావభావాలతో అలరించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ వస్తోంది. ఇందులో టైటిల్‌ రోల్‌ను కంగనా రనౌత్‌ పోషించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల కంగనా ఇచ్చిన ఓ ఇంటర్య్యూలో జ్యోతిక ప్రస్తావన తెచ్చి ఆమె నటనని ప్రశంసించారు. దాదాపు ప్రతి రోజూ ‘చంద్రముఖి’లో జ్యోతిక ఎలా నటించారో చూసి ఆ ప్రకారం తను పాత్ర కోసం ప్రిపేర్‌ అయ్యేదాన్నని కంగనా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అది చూసి జ్యోతిక పొంగిపోయారు. భావోద్వేగంతో ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టి అందులో కంగనను పొగిడేశారు. ‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఒక గొప్ప నటి, ప్రతిభావంతురాలు కంగన నటించిన ‘చంద్రముఖి 2’ కోసం నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నేను మీకు వీరాభిమానిని. లారెన్స్‌ మాస్టర్‌కు అభినందనలు. దర్శకుడు వాసు సార్‌.. మీ ఖాతాలో మరో హిట్‌ పడినట్లే’ అని పేర్కొన్నారు జ్యోతిక.

Updated Date - 2023-09-08T10:24:45+05:30 IST