తొలి ప్రేక్షకుణ్ణి నేనే

ABN , First Publish Date - 2023-09-06T03:32:54+05:30 IST

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రానికి చిరంజీవి ప్రశంసలు దక్కాయి. మంగళవారం ఈ చిత్రాన్ని తిలకించిన చిరంజీవి చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమాకు తొలి ప్రేక్షకుణ్ణి తానేనన్నారు...

తొలి ప్రేక్షకుణ్ణి నేనే

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రానికి చిరంజీవి ప్రశంసలు దక్కాయి. మంగళవారం ఈ చిత్రాన్ని తిలకించిన చిరంజీవి చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమాకు తొలి ప్రేక్షకుణ్ణి తానేనన్నారు. సినిమా ఆద్యంతం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. నవీన్‌పొలిశెట్టి, అనుష్క జంట గొప్ప నటన కనబరిచారు, సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అభినందించారు. చక్కని కుటుంబ కథా చిత్రాన్ని అందించారంటూ దర్శకుడు పి. మహేశ్‌బాబును మెచ్చుకున్నారు. మరోసారి ఈ సినిమాను చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.

Updated Date - 2023-09-06T03:32:54+05:30 IST