ట్రెండింగ్‌లో నిజమే నే చెబుతున్నా...

ABN , First Publish Date - 2023-07-05T02:46:28+05:30 IST

సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందుతున్న హారర్‌ చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర స్వరపరిచిన ‘నిజమే నే చెబుతున్నా’ పాట సంగీత ప్రియులను...

ట్రెండింగ్‌లో నిజమే నే చెబుతున్నా...

సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందుతున్న హారర్‌ చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర స్వరపరిచిన ‘నిజమే నే చెబుతున్నా’ పాట సంగీత ప్రియులను ఎంతగానో మెప్పిస్తోంది. కొద్దికాలంలోనే యూట్యూబ్‌లో మూడు కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. సోషల్‌ మీడియానూ ఈ పాట ఓ ఊపు ఊపుతోంది. ఇన్‌స్టా రీల్స్‌లోనూ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా సిద్‌ శ్రీరామ్‌ తన గొంతుతో మంత్ర ముగ్ధులను చేశారు. ‘నిజమే నే చెబుతున్నా’ పాటకు వస్తున్న ఆదరణపై శేఖర్‌ చంద్ర స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ పాటకు వస్తున్న ఆదరణకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ప్రశంసిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. సినిమా రిలీజయ్యాక మరింత మందికి ఈ గీతం చేరువవుతుంది’ అని అన్నారు.

Updated Date - 2023-07-05T02:46:28+05:30 IST