సస్పెన్స్‌తో నేనెక్కడున్నా

ABN , First Publish Date - 2023-10-18T02:54:27+05:30 IST

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిధున్‌ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నేనెక్కడున్నా’. సశా ఛెత్రి కథానాయిక...

సస్పెన్స్‌తో నేనెక్కడున్నా

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిధున్‌ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నేనెక్కడున్నా’. సశా ఛెత్రి కథానాయిక. మాధవ్‌ కోదాడ దర్శకత్వంలో మారుతి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. విడుదల తేదీ ఖరారైంది. నవంబర్‌ 17న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘జర్నలిజం, పాలిటిక్స్‌ నేపథ్యంలో తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయ’న్నారు. ‘నేనెక్కడున్నా’ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నామని శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి చెప్పారు.

Updated Date - 2023-10-18T02:54:27+05:30 IST