భగత్ సింగ్ కోసం భారీ సెట్
ABN , First Publish Date - 2023-06-06T02:11:42+05:30 IST
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల కథానాయిక. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది...

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల కథానాయిక. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో కళా దర్శకుడు ఆనంద్ సాయి నేతృత్వంలో ఓ భారీ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. తదుపరి షెడ్యూల్ ఈ సెట్‌లోనే జరగబోతోంది. ఇక్కడే పవన్ కల్యాణ్, శ్రీలీల, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ‘ఉస్తాద్..’ గ్లిమ్స్‌ని విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ‘గబ్బర్ సింగ్’ తరవాత పవన్ – హరీశ్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. అందుకే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ – లక్ష్మణ్ తీర్చిదిద్దిన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.