ఎంత పని చేశావే.. రాధికా!
ABN , First Publish Date - 2023-11-28T06:12:51+05:30 IST
‘డీజే టిల్లు’ చూస్తే టిల్లు పాత్ర ఎంత గుర్తిండిపోతుందో, రాధిక పాత్ర కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి ‘టిల్లు స్క్వేర్’లో రాధిక ఉందా? ఆమె ఉన్నా, లేకపోయినా...
‘డీజే టిల్లు’ చూస్తే టిల్లు పాత్ర ఎంత గుర్తిండిపోతుందో, రాధిక పాత్ర కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి ‘టిల్లు స్క్వేర్’లో రాధిక ఉందా? ఆమె ఉన్నా, లేకపోయినా.. రాధిక పేరుతో ఓ పాట ఉంది. ఆ పాటని సోమవారం విడుదల చేశారు. రామ్ మిరియాల పాడి, స్వర పరచిన పాట ఇది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రమిది. మల్లిక్‌రామ్ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 2024 ఫిబ్రవరి 9న విడుదల అవుతోంది. ‘‘ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండో పాట ఇది. తొలి పాట ‘టికెట్టే కొనకుండా’కు మంచి స్పందన వచ్చింది. ఆ పాటకు ‘రాధిక’ ఏమాత్రం తీసిపోదు’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.