ఎంత బాగా నచ్చావో...

ABN , First Publish Date - 2023-03-26T00:42:17+05:30 IST

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్‌ కథానాయిక. కార్తీక్‌ దండు దర్శకత్వం వహించారు....

ఎంత బాగా నచ్చావో...

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్‌ కథానాయిక. కార్తీక్‌ దండు దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఏప్రిల్‌ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చావులే.. నచ్చావులే’ అనే గీతాన్ని విడుదల చేశారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చారు. కృష్ణకాంత్‌ రాశారు. కార్తీక్‌ ఆలపించారు. ‘‘1990 నేపథ్యంలో సాగే కథ. ఓ గ్రామంలో ప్రజలు ఓ వింత సమస్యతో బాధ పడుతుంటారు. దాన్ని కథానాయకుడు ఎలా పరిష్కరించాడు అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ప్రతీ సన్నివేశం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంద’’ని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-03-26T00:42:19+05:30 IST