ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో!
ABN , First Publish Date - 2023-02-14T03:10:12+05:30 IST
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ప్రశంసిస్తున్న విదేవా చిత్ర ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది...
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ప్రశంసిస్తున్న విదేవా చిత్ర ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్ చాలా బాగుందని వారంతా మెచ్చుకుంటున్నారు. తాజాగా హాలీవుడ్ నటుడు, విలన్ పాత్రలతో అలరించే జోనాథన్ మేజర్స్ కూడా ఈ సినిమా సూపర్ అని చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటన నాకు బాగా నచ్చింది. ఇండియన్ సినిమాలను చూడమని నా స్నేహితులకు చెబుతున్నాను’ అన్నారు. జోనాథన్ నటించిన ‘కాంగ్ ద కాంకరర్’ చిత్రం త్వరలో విడుదల కానుంది.