సూపర్‌ హీరోగా ఎలా మారాడు?

ABN , First Publish Date - 2023-08-28T01:23:53+05:30 IST

అరవింద్‌ కృష్ణ, అషే రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘మాస్టర్‌ పీస్‌’. సుకు పూర్వాజ్‌ దర్శకుడు. శ్రీకాంత్‌ నిర్మాత. తాజాగా ప్రీ టీజర్‌ని విడుదల చేశారు...

సూపర్‌ హీరోగా ఎలా మారాడు?

అరవింద్‌ కృష్ణ, అషే రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘మాస్టర్‌ పీస్‌’. సుకు పూర్వాజ్‌ దర్శకుడు. శ్రీకాంత్‌ నిర్మాత. తాజాగా ప్రీ టీజర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సూపర్‌ హీరోగా మారిన సామాన్యుడి కథ ఇది. సమాజంలో జరిగే అన్యాయాల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అందుకోసం సూపర్‌ హీరోగా ఎలా మారాడు? అనేది ఆసక్తికరం. వెండి తెరకు ఈ సినిమాతో ఓ సూపర్‌ హీరోని పరిచయం చేస్తున్నాం. అరవింద్‌ కృష్ణ లుక్‌కి మంచి స్పందన వచ్చింద’’న్నారు. సంగీతం: ఆశీర్వాద్‌.

Updated Date - 2023-08-28T01:23:53+05:30 IST