ఆయన నిర్ణయం బాధించింది

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:10 AM

రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం చేయకపోవడం తనను ఎంతగానో బాధించిందని ఆయన భార్య లతా రజనీకాంత్‌ అన్నారు. తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గనుక ...

ఆయన నిర్ణయం బాధించింది

రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం చేయకపోవడం తనను ఎంతగానో బాధించిందని ఆయన భార్య లతా రజనీకాంత్‌ అన్నారు. తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గనుక రాజకీయాల్లో ఉండి ఉంటే సూపర్‌ పవర్‌గా ఎదిగేవార ని చెప్పారు. ఇటీవలే ఆమె ఓ కార్యక్రమంలో పాత్రికేయులతో మాట్లాడారు. రజనీకాంత్‌లో గొప్ప నాయకుణ్ణి చూశాను, ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి ఓ బలమైన కారణం ఉందన్నారు. అలాగే ‘కొచ్చాడయాన్‌’ చిత్రానికి సంబంధించి తనపై నడుస్తున్న చిటీంగ్‌ కేసు గురించి మాట్లాడుతూ... ‘నేను కేవలం రుణానికి హామీదారుగా మాత్రమే ఉన్నాను, ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, సెలబ్రిటీలుగా ఉన్నందుకు ఈ రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నాం’ అని తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 01:10 AM