హిలేరియస్‌ కల్ట్‌

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:52 AM

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి తన సొంత సంస్థలు వన్మయే క్రియేషన్స్‌, విశ్వక్సేన్‌ సినిమా్‌సలో సినిమాలు తీయాలని హీరో విశ్వక్సేన్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా...

హిలేరియస్‌ కల్ట్‌

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి తన సొంత సంస్థలు వన్మయే క్రియేషన్స్‌, విశ్వక్సేన్‌ సినిమా్‌సలో సినిమాలు తీయాలని హీరో విశ్వక్సేన్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 25 మంది కొత్త నటీనటులతో ‘కల్ట్‌’ చిత్రం నిర్మించనున్నట్లు శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన వెల్లడించారు. ఈ చిత్రంతో తాజుద్దీన్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్‌ మాట్లాడుతూ ‘నిజంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ‘కల్ట్‌ ’ కథ రాశాను. నాకు నటన నేర్పించి, నాకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చిన వ్యక్తి తాజుద్దీన్‌. అందుకే ఆయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. హిలేరియ్‌సగా ఉంటూ మంచి సందేశంతో ‘కల్ట్‌’ చిత్రం రూపుదిద్దుకుంటుంది’ అన్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తామనీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 04:52 AM