అదిరిందబ్బా... ‘హిడింబ’

ABN , First Publish Date - 2023-05-27T03:21:37+05:30 IST

అశ్విన్‌ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయిక. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించారు.

అదిరిందబ్బా... ‘హిడింబ’

అశ్విన్‌ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయిక. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రముఖ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా తేజ్‌ మాట్లాడుతూ ‘‘అశ్విన్‌ నాకు క్రికెట్‌ గ్రౌండ్‌లో పరిచయం. ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. ‘హిడింబ’ ట్రైలర్‌ అదిరిపోయింది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు ఈ కథని తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంటుంద’’న్నారు. ‘‘ఒరిజినల్‌ కంటెంట్‌తో తీసిన సినిమా ఇది. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌లా మొదలై, హిస్టారికల్‌ ఫిక్షన్‌లా ముగుస్తుంది. సాంకేతిక నిపుణులంతా చక్కటి సహకారం అందించార’’న్నారు దర్శకుడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు నిర్మాత.

Updated Date - 2023-05-27T03:21:44+05:30 IST