సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hidimba songs : పాటల ప్రయాణంలో హిడింబ

ABN, First Publish Date - 2023-06-11T01:36:05+05:30

అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. నందితాశ్వేత కథానాయిక. అనిల్‌ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘మెమోరీస్‌.. మెమోరీస్‌’ అనే పాటని శనివారం ప్రముఖ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. నందితాశ్వేత కథానాయిక. అనిల్‌ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘మెమోరీస్‌.. మెమోరీస్‌’ అనే పాటని శనివారం ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఆవిష్కరించారు. వికాస్‌ స్వర పరిచిన గీతమిదది. యశస్వి కొండేపూడి, యాజిన్‌ నిజార్‌ ఆలపించారు. విరించి పుట్ల సాహిత్యం అందించారు. ‘‘భారీ బడ్జెత్‌తో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. శ్రీనివాసరెడ్డి, సాహితీ అవంచ, సంజయ్‌ స్వరూప్‌, షిజ్జు తదితరులు నటించారు.

Updated Date - 2023-06-11T01:36:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!