కొత్త షెడ్యూల్‌లో హాయ్‌ నాన్న

ABN , First Publish Date - 2023-09-03T01:26:30+05:30 IST

శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు...

కొత్త షెడ్యూల్‌లో హాయ్‌ నాన్న

శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ కూనూర్‌ పచ్చని అందాల నడుమ ప్రారంభమైంది. నాని, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల అవుతోంది.

Updated Date - 2023-09-03T01:26:30+05:30 IST