సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వీరంగానికి సిద్ధమైన వీరయ్య

ABN, First Publish Date - 2023-01-03T00:24:25+05:30

ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేయడానికి సిద్ధమయ్యారు చిరంజీవి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేయడానికి సిద్ధమయ్యారు చిరంజీవి. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది. బాబి దర్శకత్వం వహించారు. రవితేజ కీలక పాత్రధారి. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈనెల 13న ‘వీరయ్య..’ రిలీజ్‌కి సిద్ధమయ్యాడు. సోమవారం సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ‘‘వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి మాస్‌ విందు అందించడానికి వస్తున్నాడు. చిరంజీవి - రవితేజ కాంబినేషన్‌లో రూపొందించిన సన్నివేశాలు అభిమానుల్ని అలరిస్తాయి. ‘బాస్‌ పార్టీ’ పాటకు చక్కటి స్పందన వచ్చింది. ‘పూనకాలు లోడింగ్‌’ థియేటర్లో నిజంగానే పూనకాలు రప్పిస్తుంది. త్వరలోనే ట్రైలర్‌ కూడా విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Updated Date - 2023-01-03T00:24:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!